E.G: రాజమండ్రిలోని వంకాయల వారి వీధిలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో.. ఆయురారోగ్యాలతో జీవించాలని స్వామి వారిని ఎమ్మెల్యే వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.