TG: ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేర్చాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నాడు BRS బతుకమ్మ చీరలిస్తే ప్రజలు తిట్టుకున్నారని, ఇప్పుడు ఇందిరమ్మ చీరలు తమకెందుకు ఇవ్వట్లేదని రానివాళ్లు అడుగుతున్నట్లు చెప్పారు. ప్రతి మహిళకు చీర అందేలా చూడాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులదే అని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల మంది మహిళలకు చీరలిస్తున్నట్లు పేర్కొన్నారు.