VZM: గజపతినగరంలోని టీడీపీ కార్యాలయంలో ప్రతిరోజు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తామని ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి చెప్పారు. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశాల మేరకు మంగళవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. వచ్చిన వినతులను సంబంధిత అధికారులకు పంపించినట్లు తెలిపారు. ప్రజలు సమస్యలు తెలియజేసి పరిష్కరించుకోవాలన్నారు.