రోహింగ్యాల కేసులో సుప్రీంకోర్టు పిటిషనర్లపై మండిపడింది. కస్టడీలో ఉన్న ఐదుగురు రోహింగ్యాలు కనిపించట్లేదని, కేంద్రానికి నోటీసులు ఇవ్వాలని కోరగా.. కోర్టు అందుకు నిరాకరించింది. పైగా పిటిషనర్లపై ఫైర్ అయ్యింది. ‘దేశంలోకి వచ్చే చొరబాటుదారులకు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించాలా?’ అని ఘాటుగా ప్రశ్నించింది. అక్రమ వలసదారుల విషయంలో కఠినంగా ఉంటామని తేల్చిచెప్పింది.