కృష్ణా: మచిలీపట్నం 24వ డివిజన్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలని, మెడికల్ విద్య సాధారణ కుటుంబాలకు అందుబాటులో ఉండాలని డిమాండ్ చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని, మెడికల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేశారు.