NTR: ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎనిమిది ప్రాంతాల్లో స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుకు చర్యలు ప్రారంభమయ్యాయి. ఇక్కడి నుంచి గంటలోపు వేడి భోజనం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, స్మార్ట్ కిచెన్‌లో తయారుచేసే స్టీమ్ రైస్‌ను విద్యార్థులు ఇష్టపడరనే ఆందోళన ఉంది. మరోవైపు, ఈ కిచెన్ల ఏర్పాటుతో 4 వేల మందికి పైగా మధ్యాహ్న భోజనం హెల్పర్లు ఉపాధి కోల్పోనున్నారు.