కృష్ణా: గుడ్లవల్లేరు మండలంలో స్వచ్ఛ రథం మంగళవారం పర్యటించి, గ్రామస్థులకు నిత్యావసర వస్తువులను అందజేసింది. గ్రామస్థులు ప్లాస్టిక్, ఇనుము, పేపర్ వంటి పనికిరాని స్క్రాప్ వ్యర్థాలను స్వచ్ఛ రథానికి అందించారు. ఇలా చేయడం వల్ల గ్రామం శుభ్రంగా ఉండడంతో పాటు, స్క్రాప్‌కు బదులుగా సరుకులు పొందవచ్చని అధికారులు తెలిపారు.