కాశీలో 19 ఏళ్ల వేదమూర్తి దేవవ్రత్ అద్భుతం చేశాడు. 50 రోజుల పాటు నాన్‌స్టాప్‌గా శుక్ల యజుర్వేదంలోని 2000 మంత్రాలతో ‘దండక్రమ పారాయణం’ పూర్తి చేశాడు. దీనిపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. భారతీయ సంస్కృతి గర్వపడేలా చేశాడని, గురు పరంపరకు ఈ కుర్రాడు నిలువుటద్దం అని కొనియాడారు. కాశీ ఎంపీగా తనకు ఇది ఎంతో గర్వకారణమని మోదీ ఎమోషనల్ అయ్యారు.