KDP: బ్రహ్మంగారిమఠం మండలంలో చేపట్టిన బోగస్ ఆన్లైన్ భూముల గుర్తింపు ప్రక్రియ పురోగతిపై పొద్దుటూరులోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం MLA పుట్టా సుధాకర్ యాదవ్ రెవిన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు ఇప్పటివరకు చేపట్టిన భూపరిశీలన వివరాలను MLAకు తెలియజేశారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా నిష్పాక్షికంగా ఈ ప్రక్రియను చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు.