MHBD: గూడూరు మండలం మచ్చర్ల గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామ యువకులు ఫ్లెక్సీల ద్వారా సంచలన ప్రచారం చేపట్టారు. కోతులు, కుక్కల బెడద నుంచి శాశ్వతంగా విముక్తి కల్పించిన సర్పంచ్ అభ్యర్థికే ఓటు వేస్తామని ఫ్లెక్సీలపై బోల్డ్‌గా రాశారు. గ్రామ సమస్యలను బహిరంగంగా ప్రస్తావించిన యువకులకు గ్రామస్థులు భారీగా మద్దతు తెలుపుతూ అభినందనలు తెలిపారు.