VZM: రాజాంలో మంగళవారం ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై డీఎస్పీ రాఘవులు, సీఐ అశోక్ కుమార్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని అన్నారు. నిబంధన ప్రకారమే ప్రయాణికులను ఎక్కించుకోవాలని, ఎక్కువ మందిని ఎక్కించుకోకూడదని సూచించారు. ఫోన్ వినియోగిస్తూ డ్రైవింగ్ చేయడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయన్నారు.