MHBD: తొర్రూర్ మండలంలో సర్పంచ్ ఎన్నికల్లో యువత కీలకంగా మారనున్నారు. ఈ నేపథ్యంలో వారు నామినేషన్ వేసిన సర్పంచ్ అభ్యర్థుల వివరాలను, వార్డుల వారీగా పోటీలో ఉన్నవారి జాబితాను యువకులు ఆరా తీస్తున్నారు. పార్టీ గుర్తు కంటే వ్యక్తి సమర్థత, గ్రామానికి న్యాయం చేసే సామర్థ్యాన్నే ప్రధానంగా చూస్తున్నామని యువత చెబుతోంది. గ్రామాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి.