సత్యసాయి: కలెక్టర్ శ్యాంప్రసాద్ మంగళవారం బుక్కపట్నం మండలం కొట్టాలపల్లి గ్రామాన్ని సందర్శించి, ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన మామిడి తోట పనులు, నీటి నిల్వ గుంతలను పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడు కృష్ణయ్య తన సంతృప్తిని వ్యక్తం చేశారు. గ్రామీణ ఉపాధి, నీటి సంరక్షణ కోసం రైతులు ఈ పథకాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.