TG: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం అభిమానులతో కిక్కిరిసిపోయింది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా ఇవాళ పంజాబ్, బరోడా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే, స్టేడియంలోకి ఫ్రీ ఎంట్రీ కావడంతో మైదానం ఫ్యాన్స్‌తో నిండిపోయింది. అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యాను చూసేందుకు అభిమానులు భారీగా తరలొచ్చినట్లు తెలుస్తోంది.