KDP: వేముల మండలానికి 150 క్వింటాళ్ల వేరుసెనగకాయలు మంజూరు అయ్యాయని వ్యవసాయ అధికారి ఓబులేసు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఒక్కో రైతుకు కనిష్టంగా 30 కిలోలు,గరిష్టంగా 90 కిలోలు అందజేస్తామన్నారు. పూర్తి ధర రూ.9,200 కాగా సబ్సిడీ రూ.3,680 తీసివేయగా రైతు వాటా రూ.5520 గా నిర్ణయించారన్నారు. విత్తనాలు కావలసిన రైతులు RBKలో నమోదు చేయించుకోవాలన్నారు.