రెబల్ స్టార్ ప్రభాస్తో దర్శకుడు మారుతి తెరకెక్కిస్తోన్న హర్రర్ కామెడీ థ్రిల్లర్ ‘రాజాసాబ్’. 2026 జనవరి 9న ఇది విడుదలవుతుంది. ఈ సినిమా రన్ టైం లాక్ అయినట్లు తెలుస్తోంది. ఇది 3:15 గంటల నిడివితో రాబోతున్నట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.