MNCL: బెల్లంపల్లి నియోజకవర్గం 7 మండలాల్లో 2వ రోజు నామినేషన్ల జోరు కొనసాగింది. 144 సర్పంచ్ స్థానాలకు 301 నామినేషన్లు, 996 వార్డులకు గాను 739 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు ప్రకటనలో తెలిపారు. మంగళవారం సైతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుందని వివరించారు. నామినేషన్ సెంటర్ల వద్ద అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు.