NLR: నగరంలోని చిన్న బజార్ పోలీస్ స్టేషన్ ను గుంటూరు రేంజ్ ఐజి సర్వ శ్రేష్ఠ త్రిపాఠి, జిల్లా ఎస్పీ డా. అజితా వేజెండ్ల మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ మ్యాప్ ను పరిశీలించి, స్టేషన్ పరిధిలోని పరిస్థితులు, నేర ప్రాంతాలపై ఆరా తీశారు. రికార్డులను పరిశీలించి, ఫిర్యాదుదారులతో గౌరవప్రదంగా నడుచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.