MBNR: హన్వాడ మండలంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 90 సర్పంచ్, 177 వార్డులకు నామినేషన్లు స్వీకరించినట్లు సహాయ ఎన్నికల అధికారిణి యశోద తెలిపారు. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. పరిశీలన పూర్తయ్యాక, చెల్లుబాటైన అభ్యర్థుల తుది జాబితాను ఈ నెల 6న ప్రకటిస్తామని ఆమె స్పష్టం చేశారు.