ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని అన్న క్యాంటీన్ ఆర్టీసీ బస్టాండ్లను ఇంఛార్జ్ సబ్ కలెక్టర్, MRO మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. అన్న క్యాంటీన్లో మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని సబ్ కలెక్టర్ ఆరా తీశారు. అలాగే బస్టాండ్ ప్రాంగణాన్ని, స్టాల్స్‌ను సందర్శించారు. రేట్లు, నాణ్యతలను క్షుణ్ణంగా పరిశీలించారు.