పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మృతి చెందినట్లు వస్తోన్న వార్తలను అక్కడి ప్రభుత్వం ఖండించింది. అయితే ఇమ్రాన్‌కు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో ఆయన మద్దతుదారులు ఆందోళన చేపట్టారు. భారీ ర్యాలీ చేసేందుకు సిద్ధమయ్యారు. వారిని అడ్డుకునేందుకు రావల్పిండిలో ప్రభుత్వం సెక్షన్ 144 విధించింది. రేపటి వరకు అన్ని బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.