స్టార్ నటి, మిల్కీ బ్యూటీ తమన్నా రూటు మార్చింది. ఓదెల-2, రైడ్-2 తర్వాత ప్రస్తుతం మరో క్రేజీ బయోపిక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లెజెండరీ డైరెక్టర్ వి. శాంతారాం బయోపిక్ లో ఆయన భార్య ‘సంధ్య’ పాత్రలో తమన్నా నటించనుంది. ఇందులో సిద్ధాంత్ చతుర్వేది హీరో కాగా, అభిజిత్ దేశ్పాండే దర్శకుడు. కథ వినగానే తమన్నా ఓకే చెప్పేసిందట. త్వరలోనే షూటింగ్ మొదలుకానుంది.