NZB: బోధన్ ఎక్సైజ్ కార్యాలయంలో అనుమతి లేకుండా చెట్లను నరికిన అధికారులకు అటవీశాఖ అధికారులు రూ. 3,490 జరిమానా విధించారు. మొదటి నుంచి ఎక్సైజ్ అధికారుల తీరు వివాదాస్పదంగానే ఉంటుంది. వారి నిర్లక్ష్యానికి అటవీశాఖ అధికారులు విధించిన జరిమానా మరో ఉదాహరణగా నిలుస్తోంది. ఇకనైనా ఎక్సైజ్ అధికారులు తీరుమార్చుకొని మెరుగైన సేవలు అందించాలని కోరుతున్నారు.