WGL: నర్సంపేట పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో ఇంటి పన్ను కేటాయింపుల్లో భారీ అక్రమాలు జరుగుతున్నట్లు సమాచారం. ఎలాంటి నిర్మాణం లేని ఖాళీ స్థలాలకు లక్షల రూపాయలు వసూలు చేసి ఇంటి నంబర్లు కేటాయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సీనియర్ అధికారి చేతుల్లో ఈ వ్యవహారం నడుస్తుంది. ఈ అక్రమాలపై అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.