పార్లమెంట్ సమావేశాలు రచ్చరచ్చగా మొదలయ్యాయి. లోక్సభలో విపక్షాలు ‘SIR’ ప్రక్రియను వెంటనే ఆపాలంటూ ఆందోళనకు దిగాయి. దీనిపై సభలో చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టాయి. అటు పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీలు భారీ ధర్నా చేశారు. ఈ నిరసనలో కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ పాల్గొని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.