ATP: గుంతకల్లు పట్టణంలోని 35వ వార్డులో వైసీపీ సీనియర్ నాయకులు శర్మస్ మంగళవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ శర్మాస్ భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సంతాపం వ్యక్తం చేశారు.