SKLM: అనంతపురం జిల్లా చిగిచెర్లలో గత నెల 28 నుంచి 30వ తేదీ వరకు జరిగిన రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో టెక్కలికి చెందిన విద్యార్థిని ప్రతిభ కనబరిచింది.టెక్కలిలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలో చదువుతున్న కిల్లి కావ్య అండర్-19లో 44కేజీల విభాగంలో రాష్ట్రస్థాయిలో తృతీయ స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ సాధించినట్లు కళాశాల సిబ్బంది తెలిపారు.