సినీప్రముఖులు చనిపోయినప్పుడు మీడియా వ్యవహరిస్తోన్న తీరుపై జాన్వీ కపూర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తన తల్లి చనిపోయినప్పుడు తనని టార్గెట్ చేశారని, తల్లి గురించి చెప్పిన మాటలపై మీమ్స్ చేశారని అసహనం వ్యక్తం చేసింది. ఇప్పుడు దివంగత నటుడు ధర్మేంద్ర విషయంలోనూ ఇలాగే జరుగుతుందని తెలిపింది. వ్యూస్, లైక్స్ కోసం ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారని, ఇలాంటి ధోరణిని ప్రోత్సహించకూడదని పేర్కొంది.