GNTR: గుంటూరులో మణిపురం బ్రిడ్జిపై విధుల్లో ఉన్న శానిటరీ వర్కర్ దుర్గం చెల్లెమ్మను మంగళవారం ఉదయం బైక్పై వెళ్తున్న వ్యక్తి ఢీకొట్టాడు. దీంతో ఆమె స్వల్పంగా గాయపడింది. వెంటనే సహచర సిబ్బంది గాయపడిన చెల్లెమ్మను ఆసుపత్రిలో చేర్చారు. తాగుబోతు డ్రైవర్ల నుంచి తమకు రక్షణ కల్పించాలని కార్మికులు డిమాండ్ చేశారు.