TG: రాష్ట్రంలో తొలి విడత సర్పంచ్ ఎన్నికలు జరిగే పంచాయతీల్లో 5 గ్రామాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. మంచిర్యాల జిల్లాలో 3 గ్రామాలు, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలో ఒక్కో గ్రామం ఉంది. ఇంకా 133 వార్డులకు కూడా ఒక్క నామినేషన్ దాఖలు కాలేదని ఈసీ అధికారులు గుర్తించారు. అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 34, ఆసిఫాబాద్ 30, జనగామ 10, వికారాబాద్ జిల్లాలో 19 వార్డులు ఉన్నాయి.