ప్రకాశం: పెదదోర్నాలో స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మంగ ళవారం మండల సర్వ సభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ప్రసూన దేవి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండలంలోని అన్ని ప్రగతిపనులు, సమస్యలపై సంబంధిత అధికారులతో సమీక్ష ఉంటుందని, జడ్పీటీసీ, ఎంపీ టీసీ సభ్యులు, సర్పంచులు, ఆయా శాఖాధికారులు హాజరు కావాలని ఆమె కోరారు.