సత్యసాయి: మంత్రి సవిత మంగళవారం ఉదయం పెనుకొండలోని జూనియర్ కళాశాల మైదానంలో స్థానిక ప్రజలతో కలిసి వాకింగ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలతో నేరుగా ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, డ్రెయినేజీ, తాగునీరు వంటి మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించి, పెనుకొండ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.