MLG: తాడ్వాయి మండలం మేడారంలో జరిగే సమ్మక్క-సారలమ్మ మహా మరో 56 రోజులు మిగిలి ఉంది. 2026, జనవరి 28 నుంచి 3వ తేదీ వరకు మాహా జాతర జరగనుంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మహా జాతరను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ. 150 కోట్లు కేటాయించింది. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.