ప్రపంచ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఫ్రాంఛైజీల్లో ‘అవతార్’ ఒకటి. ఈ సిరీస్ నుంచి ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ మూవీ ఈ నెల 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇండియాలో ఈ మూవీ టికెట్ బుకింగ్స్ ఈ నెల 5న ఓపెన్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఇక దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.