MDK: నార్సింగి మండలం భీమ్రావుపల్లి గ్రామానికి చెందిన మమతా వార్డు సభ్యురాలిగా నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన నామినేషన్ కార్యక్రమానికి ఆమె తన నాలుగు నెలల పసిపాపను ఎత్తుకొని రావడం ప్రత్యేకంగా నిలిచింది. సోమవారం నాలుగో వార్డు సభ్యురాలిగా నామినేషన్ దాఖలు చేసి ఎన్నికల బరిలో నిలవనున్నారు.