MDK: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని కలెక్టర్ రాహుల్ రాజ్ చెప్పారు. సోమవారం ఐడీవోసీ కార్యాలయంలో స్టేజ్ -2 అధికారులకు శిక్షణ ఇచ్చి, నామినేషన్ నుంచి ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశలో పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పారదర్శక, నిష్పక్షపాత ఎన్నికల కోసం సమన్వయం, భద్రత, శిక్షణ, మెటీరియల్ పంపిణీ పకడ్బందీగా నిర్వహించాలన్నారు.