BDK: గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని కొత్తగూడెం మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కొత్తగూడెం పర్యటన నేపథ్యంలో టూ టౌన్ పోలీసులు కాపు సీతాలక్ష్మిని ఇవాళ హౌస్ అరెస్ట్ చేశారు. ఆమె స్పందిస్తూ.. ప్రజా పాలన చేస్తామని చెప్పి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారన్నారు.