NLR: నెల్లూరులోని సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఇన్ఛార్జ్ జిల్లా ప్రాజెక్టు అధికారిణిగా సుజాత బాధ్యతలు చేపట్టారు. ఆమె అదే కార్యాలయంలో ఉద్యోగ విధులు నిర్వహిస్తుండగా అదనపు బాధ్యతలు అప్పగించారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న మల్లికార్జున్ రెడ్డి సీఆర్డీఏ కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఆమె మాట్లాడుతూ.. తన పరిధిలో వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.