హాంకాంగ్‌లోని అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 151కి చేరింది. మరో 104 మంది ఆచూకీ లభ్యం కాలేదు. వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రమాద బాధితుల కుటుంబాలను ఆదుకోవడం కోసం ప్రజలు సాయం చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు దాదాపు రూ.1029 కోట్లు సమకూర్చినట్లు అధికారులు తెలిపారు.