KRNL: విద్యార్థులు పాఠశాల మైగ్రేషన్ (బదిలీ) అయితే ఆ ప్రధానోపాధ్యా యుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ సోమవారం హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మరోవైపు, 10వ తరగతి విద్యార్థులకు బోధన చేస్తున్న టీచర్లకు కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరులలో ఎస్ఎస్సీ పరీక్షలపై శిక్షణ ఇస్తున్నామని చెప్పారు.