GNTR: మోటారు వాహనాల దొంగతనాలు, దారిదోపిడీలకు పాల్పడుతున్న శ్రీకాంత్ అనే నిందితుడిని సోమవారం నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి మూడు బైక్‌లు, ఒక ఆటో, ఒక సెల్‌ఫోన్‌ను రికవరీ చేశారు. మిర్చి యార్డు సమీపంలో జరిగిన దోపిడీతో పాటు పలు దొంగతనాల్లో ఇతడి పాత్ర ఉందని పోలీసులు తెలిపారు.