W.G: కొడుకు చితికి తల్లి నిప్పు పెట్టిన విషాధకర ఘటన పాలకొల్లులో చోటుచేసుకుంది. బంగారువారి చెరువు గట్టుకు చెందిన సత్యవాణి భర్తతో విడాకులు తీసుకుని కుమారుడు శ్రీనివాస్‌తో కలిసి ఉంటోంది. ఈ నేపథ్యంలోనే మద్యానికి బానిసైన శ్రీనివాస్ అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. అయిన వాళ్లు లేకపోవడంతో తల్లి కైలాస రథంపై హిందూ స్మశాన వాటికకు మృతదేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించింది.