‘ది ఫ్యామిలీ మ్యాన్’ దర్శకుడు రాజ్ నిడిమోరును నటి సమంత రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తెలుపుతూ సామ్.. ఇన్స్టాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. 16 గంటల వ్యవధిలోనే ఈ పోస్టుకు 79.5 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. మరోవైపు ఈ జోడీకి సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ విషెస్ చెబుతున్నారు. కాగా, ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2లో సామ్ నటించిన విషయం తెలిసిందే.