విశాఖలో ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కిశోర్ అనే వ్యక్తి మౌనిక అనే అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ దొండపర్తి సమీపంలోని కుప్పిలి వీధిలో అద్దేకి ఉంటున్నారు. కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయని కుటుంభ సభ్యులు తెలిపారు. ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా.. కిశోర్ ఉరివేసుకున్నాడని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.