KRNL: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చిన ప్రతి ఫిర్యాదుపై త్వరితగతిన విచారణ జరిపి చట్టపరంగా బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం కొత్తపేటలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల విజ్ఞప్తులను స్వీకరించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.