WGL: నల్లబెల్లి మండలంలో రెండో విడత నామినేషన్ల ప్రక్రియలో మొత్తం 125 నామినేషన్లు నమోదైనట్లు ఎంపీడీవో డాక్టర్ జె.శుభ నివాస్ తెలిపారు. సర్పంచ్ స్థానాలకు 51, వార్డు సభ్య స్థానాలకు 74 నామినేషన్లు దాఖలయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు పారదర్శకంగా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రక్రియ జరిగిందని, ఎన్నికలు సజావుగా సాగుతున్నాయని ఎంపీడీవో పేర్కొన్నారు.