JGL: సీనియర్ సిటిజన్స్ డిమాండ్లు త్వరగా పరిష్కరించాలని టాస్కా జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. జగిత్యాల టాస్కా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. సీనియర్ సిటిజన్స్ కోసం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని, ఆర్టీసీ బస్సుల్లో 50% రాయితీ ఇవ్వాలని, హెల్ప్ న్ను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు.