AP: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శారదానగర్ పోస్ట్ ఆఫీస్ ఎదురు బిల్డింగ్లో మంటలు చెలరేగాయి. బిల్డింగ్ మొత్తం దట్టమైన పొగ వ్యాపించింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. లక్షల్లో ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.