SRD: అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు కల్హేర్ ఎస్సై రవిగౌడ్ సోమవారం తెలిపారు. నిజాంపేట మండలం బాచేపల్లికి చెందిన సంగమేశ్ ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా బెల్టు షాపు నడుపుతూ.. మద్యం బాటిళ్లను విక్రయిస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. ఈ మేరకు సిబ్బందితో కలిసి దాడి చేయగా రూ. 6.500 విలువ గల 23 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.