ఇండోనేషియాను వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలు, వరదల ధాటికి అక్కడ మృత్యుఘోష వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ విపత్తులో ఏకంగా 502 మంది ప్రాణాలు కోల్పోవడం ప్రపంచాన్ని కలచివేస్తోంది. ఇంకా చాలామంది ఆచూకీ దొరకలేదని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి.